కాలిఫోర్నియాలో భారీగా కార్చిచ్చు..40 ఫైరింజన్లు.. 600 సిబ్బంది రంగంలోకి..

By సుభాష్  Published on  9 Jun 2020 8:00 AM GMT
కాలిఫోర్నియాలో భారీగా కార్చిచ్చు..40 ఫైరింజన్లు.. 600 సిబ్బంది రంగంలోకి..

యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోలానో కౌంటీలోని అడవిలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో 1830 ఎకరాల వరకూ ఈ మంటలు వ్యాపించాయి. జూన్‌ 6వ తేదీ నుంచి మొదలైన ఈ కార్చిచ్చు.. కేవలం ఒక రోజులోనే 1800 ఎకరాలను కాల్చి బుడిద చేసేసింది. దీంతో కాలిఫోర్నియా ఏజన్సీ 40 ఫైరింజన్లు, 600 మంది సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 40 శాతం మంటలను అదుపులోకి తీసుకురాగలిగినా.. మళ్లీ మంటలు చెలరేగుతున్నారు. కాగా, భారీ మొత్తంలో కార్చిచ్చు చెలరేగడంతో అడవిలో ఉన్న జంతువులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మంటల నుంచి కాపాడుకునేందుకు ఎంతో జంతువులు పరుగులు పెడుతూ మంటల ధాటికి చిచ్కుకుని విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో మూగ జీవాలు అగ్నికి ఆహుతైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ కార్చిచ్చు సోమవారం రాత్రి వరకూ 75శాతం వరకూ చెలరేగినట్లు తెలుస్తోంది. భారీగా గాలులు వీస్తూ, మంటలు భారీగా వ్యాపించడంతో మంటలను ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బందికి ఆటంకం ఏర్పడుతోంది. అయితే ఈ కార్చిచ్చు వల్ల 100 గృహాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. భారీ మొత్తంలో మంటలు వ్యాపించిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఉండే జనాలను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కార్చిచ్చుపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మంటలు అదులోకి రాకపోవడంతో మరిన్ని అగ్నిమాపక శకటాలను, సిబ్బందిని రప్పిస్తున్నారు.

కాగా, గతంలో కూడా కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 12వేల భవనాలు, లక్షా 42వేల ఎకరాల అడవి కాలి బూడిదయ్యాయి. అప్పట్లో కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన కార్చిచ్చుగా అధికారులు పేర్కొన్నారు.

Next Story