కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని

By రాణి  Published on  4 April 2020 2:43 PM GMT
కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని

గత నెల 20వ తేదీన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ వైరస్ ను జయించింది. వరుసగా నాలుగు సార్లు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని రాగా..5వ సారి నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోసారి వైద్య పరీక్షలు చేశాక ఆమె ఆస్పత్రి నుంచి విడుదల కానున్నారు.

Also Read : బాలీవుడ్ సింగర్ కు కరోనా..సెల్ఫ్ క్వారంటైన్ లో మాజీ ముఖ్యమంత్రి

గత నెల లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ లఖ్ నవూలో వివిధ పార్టీలకు హాజరయ్యారు. ఆమె అలా పాల్గొన్న పార్టీలకు చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ నటులు కూడా వచ్చారు. కనికాకు కరోనా సోకిందన్న విషయం తెలియగానే ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. సుమారు 15 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కనికా ఇప్పుడు కోలుకున్నట్లు శనివారం వైద్యులు తెలిపారు.

Also Read : కరోనాకు వ్యాక్సిన్ లేదు..మెడికేషన్ ఉంది

Next Story
Share it