బాలీవుడ్ బాద్‌షా.. హ్యాపీ బ‌ర్త్ డే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 11:07 AM GMT
బాలీవుడ్ బాద్‌షా.. హ్యాపీ బ‌ర్త్ డే..!

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమా వ‌స్తుంది అంటే అభిమానుల‌కు పండ‌గే. ఇక ఆయ‌న పుట్టిన‌రోజు వ‌చ్చింది అంటే... అభిమానులు సంబ‌రాలు చేసుకుంటారు. ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు.. ఎన్నో రికార్డులు.. సాధించిన షారుఖ్ త‌న‌దైన స్టైల్ లో న‌టించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజు (న‌వంబ‌ర్ 2న‌) షారుఖ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా షారుఖ్ ఖాన్ గురించి క్లుప్తంగా మీ కోసం...

Bollywood

షారుఖ్ అస‌లు పేరు రెహ‌మాన్. ఆ త‌ర్వాత ఆ పేరును షారుఖ్ అని మార్చారు. షారుఖ్ అంటే రాజు లాంటి వాడ‌ని అర్ధం. షారుఖ్ ఖాన్ 1980వ దశకం చివర్లో టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. కెరీర్ మొదట్లో దార్ర్ (1993), బాజిగర్ (1993), అంజామ్ (1994) వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలు దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998), మొహొబ్బతే (2000), కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు.

Sharuk2

దేవదాస్ (2002), స్వదేశ్ (2004), చక్ దే! ఇండియా (2007), మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) సినిమాలో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచి సంచ‌ల‌నం సృష్టించాయి. సినిమాల్లో షారుఖ్ చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డ్ తో స‌త్క‌రించింది.

Sharuk4

న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను షారుఖ్‌ రాణిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. షారుఖ్ 14 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. దాదాపు 80 సినిమాల్లో న‌టించారు. ఇటీవ‌ల కాలంలో షారుఖ్ ఖాన్ న‌టించిన సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోవ‌డం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి... భ‌విష్య‌త్ లో త‌ను ఆశించిన విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటూ... షారుఖ్ హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్..!

Next Story