పేలిన బాయిలర్.. 5గురు మృతి
By తోట వంశీ కుమార్ Published on : 1 July 2020 12:35 PM IST

తమిళనాడులోని నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని యూనిట్-5లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 5గురు మృత్యువాత పడగా.. 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎన్‌ఎల్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. గత నెలలో కూడా ఇదే పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.
Next Story