ఆసక్తి కలిగిస్తున్న 'బోగన్' ట్రైలర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 1:22 PM IST
ఆసక్తి కలిగిస్తున్న బోగన్ ట్రైలర్‌

జయం రవి, అరవింద్‌ స్వామి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అర‌వింద్‌స్వామి కాంబినేష‌న్‌తో 'జ‌యం' ర‌వి న‌టించిన‌ 'త‌ని ఒరువ‌న్' (2015) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా 'ధృవ' పేరుతో రీమేక్ చేయ‌గా, ఇక్క‌డా సూప‌ర్ హిట్ట‌యింది. 'త‌ని ఒరువ‌న్' త‌ర్వాత 'జ‌యం' ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో మరో సినిమా తమిళ్‌లో విడుదలైంది. ఆ సినిమా పేరే 'బోగ‌న్‌'. ఈ సినిమా ఇప్పుడు సేమ్‌ టైటిల్‌తో తెలుగులో విడుదల కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని లక్ష్మణ్ డైరెక్ట్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తమిళనాట రూ. 25 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

ఈ చిత్రాన్ని ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను చూస్తుంటే.. సినిమాలో మన ఊహకు అందని ట్విస్టులు అనేకం ఉన్నట్లు అనిపిస్తోంది. జయం రవి తన దగ్గరకు రివ్వాలర్‌ పట్టుకొని వెరైటీగా నడుస్తూ వస్తుంటే.. హన్సిక ఫోన్‌లో ఏడుస్తూ విక్రమ్‌.. ఆదిత్య ఇక్కడకు వచ్చేశాడు.. భయంగా ఉంది. త్వరగా అనడం, కారులో ఉన్న అరవింద్‌ స్వామి వస్తున్నా వస్తున్నా అని అంటాడు. చివర్లో అరవింద్‌ స్వామి ఆదిత్యా అని కోపంతో పెద్దగా అరవడం సినిమాలో వీరిద్దరి మధ్య ఏదో వైరం ఉందని అర్ధం అవుతోంది. ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథే ‘బోగన్’ చిత్రం. విక్రమ్ ఐపీఎస్‌గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి నటించగా.. హన్సిక కథానాయికగా నటించింది.

Next Story