హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ బాడీ-2020 సమావేశం నేడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్, హైకోర్ట్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆలిండియా జ్యుడిషియల్ ఎంప్లాయిస్ కాన్ఫఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన బోధ లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఆలిండియా జుడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. జ్యూడిషియల్ ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వంతో మాట్లాడి భర్తీ ప్రక్రియ చేపడతామని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story