అయ్యో కివీస్‌కు.. ఎంత కష్టమొచ్చిందో..

By Newsmeter.Network  Published on  4 Feb 2020 9:53 AM GMT
అయ్యో కివీస్‌కు.. ఎంత కష్టమొచ్చిందో..

భారత్‌ తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కాకముందే న్యూజిలాండ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20లో గాయపడ్డ ఆ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్‌ సన్‌.. చివరి రెండు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి ఇంకా కేన్‌ కోలుకోలేదని.. భారత్ తో జరిగే తొలి రెండు వన్డేలకు అతను అందుబాటులో ఉండడని కివీస్‌ మేనేజ్‌మెంట్ తెలిపింది.

అతని స్థానంలో మార్క్ చాప్మన్ ను జట్టులోకి తీసుకున్నారు. కేన్‌ గాయంతో దూరం అవ్వడంతో చివరి రెండు టీ20లకు పేస్‌ బౌలర్‌ సౌథీ నాయకత్వ బాధ్యతలు చేపట్టగా.. వన్డేల్లో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్ మన్‌ టామ్‌ లేథమ్ కెప్టెన్‌ గా వ్యవహారించనున్నాడు. ఇక విలియమ్‌సన్‌ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని, మరోవారం పాటు ఫిట్‌నెస్‌ శిక్షణ సెక్షన్లలో అతను పాల్గొంటాడని కివీస్‌ జట్టు ఫిజియో విజయ్‌ వెల్లడించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.

Next Story