Fact Check : ఎక్కడ చూసినా నల్లని పక్షులే.. ఇంతకూ ఈ వీడియో ఎక్కడిది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2020 3:26 AM GMT
Fact Check : ఎక్కడ చూసినా నల్లని పక్షులే.. ఇంతకూ ఈ వీడియో ఎక్కడిది..!

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పక్షులకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా పక్షులే.. అది కూడా నల్లని పక్షులు.. ఓ సూపర్ మార్కెట్ ముందు ఇలా కాకులన్నీ కలిసి వందల సంఖ్యలో వున్నాయి. దీన్ని చూసిన చాలా మంది ఇదేదో యుగాంతం లాగా అనిపిస్తోంది అంటూ పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా దీన్ని విపరీతంగా షేర్ చేశారు.

New Project 2020 06 01t142912.179

“Crows not allowing customers to come out of super market in Saudi . Yesterday, it was swarm of locusts in Jaipur and now, it is crows in Saudi Arabia. Not able to understand what is happening. Is it the beginning of the end of the world ??”

కాకులు కస్టమర్లను సౌదీ అరేబియా లోని సూపర్ మార్కెట్ నుండి బయటకు రానివ్వడం లేదు. జైపూర్ లో మిడుతల దాడిని చూశాం.. ఇప్పుడు సౌదీలో కాకుల దాడి చూస్తున్నాం. ఏమవుతోందో అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంతకూ యుగాంతానికి సంకేతాలా అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కు భయపడుతూ ఉంటుంటే.. భారత్ మీద మిడుతల ప్రభావం పొంచి ఉంది.. ఇక వందల సంఖ్యలో కాకులు ఇలా దాడి చేయడం.. వీడియో వైరల్ అవుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

నిజ నిర్ధారణ :

సౌదీ అరేబియాలో కాకులు సూపర్ మార్కెట్ నుండి వినియోగదారులను బయటకు రానివ్వడం లేదని.. వారిపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నదంతా 'పచ్చి అబద్ధం'

వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్, యాండెక్స్ లలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోలు వీడియోలు 2017 కంటే ముందువి అని తెలుస్తోంది. కొన్ని రిజల్ట్స్ ను చూపించినప్పటికీ.. వీడియోలు మాత్రం ఓపెన్ అవ్వలేదు.

New Project 2020 06 01t143245.517

మిగిలిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. ifunny.co లో mattjc17 అనే యూజర్ మార్ఛి 27, 2020లో అప్లోడ్ చేశాడు. ఏప్రిల్ 17, 2020న వైరల్ హాగ్ ఈ వీడియోను పోస్టు చేసింది. https://www.youtube.com/watch?v=h7Ti-O8MByY ఈ లింక్ లో ఆ వీడియోను చూడొచ్చు. ఈ వీడియోను రికార్డు చేసింది డిసెంబర్ 6, 2016లో అని తెలుస్తోంది. కెరోల్టన్, టెక్సాస్, అమెరికాకు చెందిన వీడియో అని అందులో రాసుకుని వచ్చారు.

New Project 2020 06 01t144808.323

వైరల్ హాగ్ అనే వెబ్సైట్ వీడియోలను కొనడం, అమ్మడం చేస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. వీడియో ఈ మధ్య జరిగింది అంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నదంతా పచ్చి అబద్ధం.

New Project 2020 06 01t144907.256

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు.. కొన్ని వేల నల్లటి పక్షులు టెక్సాస్ లో కనిపిస్తూ ఉన్నాయి అంటూ చాలా వీడియోలు కనిపించాయి. స్థానికంగా గ్రాకల్స్, బోట్-టెయిల్ గ్రాకల్స్, లాంగ్ టెయిల్ గ్రాకల్స్ అంటూ ఆ పక్షులను పిలుస్తారు. ఇవి కాకుల కంటే చిన్నగా ఉండడమే కాకుండా పసుపు రంగు కన్నులు ఉంటాయి.

ఈ పక్షులు ఇలా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండడం అమెరికాలో అరుదైన విషయం కాదు. టెక్సాస్.. ఇతర అమెరికా రాష్ట్రాల్లో ఈ పక్షులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 1966 నుండి 1988 కాలంలో ఈ పక్షుల సంఖ్య భారీ ఎత్తున పెరిగిపోయింది. 3.7 శాతం ఒక్కో సంవత్సరం వీటి సంఖ్య పెరుగుతూ వెళ్లిందట.. అందుకే వీటి సంఖ్య భారీ ఎత్తున పెరిగిందంటూ చెబుతున్నారు.

ఈ పక్షులకు సంబంధించి మరింత సమాచారం కోసం

https://www.nationalgeographic.com/animals/birds/g/great-tailed-grackle/

New Project 2020 06 01t145324.421

ఈ స్థలం సౌదీ అరేబియాకు చెందినది కాదు. గూగుల్ మ్యాప్స్ లోని స్ట్రీట్ వ్యూ ఫీచర్ ద్వారా ఆ స్టోర్ ముందు భాగాన్ని, పార్కింగ్ ప్లేస్ ను పరిశీలించగా లొకేషన్ కు సంబంధించిన సరైన సమాచారం దొరికింది.

నల్లటి పక్షులు సౌదీ అరేబియా లోని సూపర్ మార్కెట్ లో నుండి మనుషులను బయటకు రాకుండా చేస్తున్నాయన్నది పచ్చి అబద్ధం.

వైరల్ హాగ్ లో పోస్ట్ చేసిన వీడియోలో స్పాట్ ఆడియో ఉంది.. అది ఒరిజినల్ ఆడియో అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోను ఎడిట్ చేశారు. వేరే వీడియోకు సంబంధించిన ఆడియోలను ఉంచి కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశ్యం ఉన్న వాళ్లు కావాలనే ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఈ సమాచారం ప్రకారం సౌదీ అరేబియా లోని సూపర్ మార్కెట్ ముందు పక్షులు మనుషులపై దాడి చేస్తున్నాయి అన్నది 'తప్పుడు సమాచారమే'.

Claim Review:Fact Check : ఎక్కడ చూసినా నల్లని పక్షులే.. ఇంతకూ ఈ వీడియో ఎక్కడిది..!
Claim Fact Check:false
Next Story