శాసనసభలో గందరగోళం.. ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌

By అంజి  Published on  16 March 2020 9:40 AM GMT
శాసనసభలో గందరగోళం.. ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర గందరగోళం తలెత్తింది. సీఏఏ, ఎన్పీఆర్‌పై వ్యతిరేకిస్తూ మాట్లాడాన్ని అడ్డుకోవడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తీర్మానం వ్యతిరేక పత్రులను చింపివేశారు. ఇక సభలో సీఏఏపై స్పీకర్‌ రెజల్యూషన్‌ పాస్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా సభలో చర్చించిన తర్వాత శాసనసభ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహంతో పోడియం వద్ద ఆందోళన చేశారు.

Also Read: విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? – కేసీఆర్‌

బిల్లు పాస్‌ చేసిన పేపర్లు చించివేసి నిరసన తెలిపారు. అంతకుముందు రాజాసింగ్‌ మాట్లాడుతూ.. సీఏఏ గురించి భారతీయులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి హాని జరగదన్నారు. సీఏఏతో ఒక్కరికి అన్యాయం జరిగినా తెలంగాణ వదిలి వెళ్లిపోతా అంటూ వ్యాఖ్యనించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకింత రాజకీయం చేస్తోందో అర్థం కావాడం లేదన్నారు. ఎన్పీఆర్‌ కొత్తగా తెచ్చిందా.. యూపీఏ హయాంలో లేదా అంటూ ప్రశ్నించారు. వ్యక్తి గత ప్రయోజనం కోసం కొందరు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

Also Read: పిల్లల ఏడుపులో భావాలు మీకు తెలుసా..?

ఇక సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీఏఏపై కేంద్రం పునః సమీక్షించాలని కోరారు. సీఏఏపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొందని అన్నారు. సీఏఏ బిల్లును పార్లమెంట్‌లో కూడా టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామని సీఎం అన్నారు. ఈ బిల్లు అనేక ఆందోళనలు సృష్టిస్తోందని, గుడ్డిగా మేం వ్యతిరేకించడం లేదని అన్ని అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక మంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఈ దేశానికి ఈ చట్టం అవసరం లేదని కేసీఆర్‌ కుండ బద్దలు కొట్టారు.

Next Story