బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ రోజు ఉద‌యం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను లక్ష్మణ్ కలవనున్నారు. కేంద్రం ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది.

అలాగే.. ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా లక్ష్మణ్‌కు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేత ఆశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు ఆయనను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.