బీజేపీ యువనేతకు కరోనా పాజిటివ్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2020 10:58 AM GMT
బీజేపీ యువనేతకు కరోనా పాజిటివ్‌..

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా.. బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా కరోనా బారినపడ్డారు.

కరోనా లక్షణాలతో బాదపడుతున్న జ్యోతిరాధిత్య సింధియా నాలుగు రోజుల క్రితం మ్యాక్స్‌ హాస్పిటల్‌లో చేరగా టెస్టులలో ఆయనకు పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా పాజిటివ్‌గా తేలింది. కాగా.. జ్యోతిరాధిత్య జ్వరం, గొంతునొప్పితోబాధపడుతుండగా.. ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. ఇద్దరూ ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా.. దశాబ్దాల కాంగ్రెస్‌తో స్నేహానికి గుడ్‌ బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరాడు జ్యోతిరాధిత్య సిందియా.

బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్రలో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గూర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరిన ఆయన సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 27 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి.

Next Story
Share it