ఢిల్లీ: బీజేపీ – జేజేపీ మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది.దీంతో హర్యానాలో పొలిటికల్ టెన్షక్‌కు తెరపడింది. హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఒప్పందం ప్రకారం సీఎం పదవి బీజేపీకి, డిప్యూటీ సీఎం పదవి జేజేకి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ఫలించినట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో శనివారం ఖట్టర్ గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని..అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు.

హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1 గెలుచుకుంటే ఇతరులు 8 మంది గెలిచారు. కొంత మంది స్వతంత్రులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఉదయమే ప్రకటించారు. సో..హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.