తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమం
By Medi SamratPublished on : 18 Oct 2019 3:44 PM IST

ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురుతిరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిన్నటి నుండి ఉబెర్, ఓలా కార్మికులు, ఉద్యోగులతో పాటు క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు.
ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని.. రాష్ట్రంలో కార్యకలాపాలు అన్నీ స్తంభించాయన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నా.. రవాణా శాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమని.. పాలన అటకెక్కించి కేవలం తమ ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమానికి బీజేపీ నాంది పలుకుతుందని లక్ష్మణ్ అన్నారు.
Next Story