బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపులో బీజేపీ బోణీ కొట్టింది. ఇప్పటి వరకూ జరిగిన ఫలితాల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట ముందంజలో ఉన్నారు. ఎల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్ శివరామ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మధ్యాహ్నం వరకూ ఓట్ల లెక్కింపు పూర్తయి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ర్టంలో మొత్తం 223 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రస్తుతం బీజేపీ సంఖ్యా బలం 105 కాగా ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. కర్ణాటకలో కమలం గెలుపు సాధించాలంటే ప్రస్తుతం వెల్లడికానున్న ఫలితాల్లో దాదాపుగా ఆరు ప్రాంతాల్లో గెలవాల్సి ఉంటుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.