బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటనపై కమిటీ.. మరో 10 రోజులూ క్లోజేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 10:19 AM GMT
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటనపై కమిటీ.. మరో 10 రోజులూ క్లోజేనా..?

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటనపై కమిటీ వేశామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో నిపుణుల కమిటీ ఆధ్వ‌ర్యంలో బయోడివర్సిటీ ఫ్లైఓవర్ సందర్శన ఉంటుందని ఆయ‌న అన్నారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని.. అతివేగమే ప్రమాదానికి కారణమ‌ని స్ప‌ష్టం చేశారు. సాధార‌ణ వేగం 40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లాలని హెచ్చరించినా.. 100 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగిందని అన్నారు. ఫ్లైఓవర్ పై వేగాన్ని నియంత్రించేందుకు నిపుణులు పరిశీలన చేస్తారని అన్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామ‌ని.. అవసరం అయితే మరో పదిరోజులు ఫ్లైఓవర్ క్లోజ్ చేసేందుకు కూడా సిద్ధమ‌ని మేయ‌ర్ తెలిపారు.

Next Story