బిన్ లాడెన్ ఏనుగు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 5:58 AM GMT
బిన్ లాడెన్ ఏనుగు మృతి

అసోం: ఐదుగురిని చంపిన బిన్ లాడెన్ అనే ఏనుగును కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. ఆ ఏనుగు ఆదివారం ఉదయం మృతి చెందింది. తొలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బంధించిన తర్వాత ఆ ఏనుగు మృతి చెందడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నవంబర్ 11న అసోంలోని గోల్పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ మదపుటేనుగుకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బంధించారు. అటవీ ప్రాంతంలో నివాసముంటున్న ఐదుగురు గ్రామస్తులను ఒకే రోజు ఈ ఏనుగు చంపడంతో అటవీశాఖ అధికారులు ఈ ఏనుగును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

ఏనుగును మొదట జనసంచారం లేనటువంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని అధికారులు భావించారు. అయితే అనూహ్యంగా దానినే ఓరంగ్ నేషనల్ పార్కు కు తరలించారు. అధికారులు దీనికి కృష్ణ అనే పేరు పెట్టారు. శనివారం వరకు ఆరోగ్యంగానే కనపడిన ఏనుగు ఆదివారం తెల్లవారుజామున మరణించిందని జూ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అసోం ప్రభుత్వం ఏనుగు మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది. పోస్టుమార్టం నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించింది.

Next Story