సురేష్ కుమార్ శర్మ.. బీహార్ రాష్ట్రం అర్బన్ డెవలప్మెంట్, హోసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ సురేష్ కుమార్ శర్మ ఓ ఫ్లైఓవర్ కు చెందిన ఫోటోను పోస్టు చేశారు. తమ ప్రభుత్వ గొప్పతనం అంటూ వీధి దీపాలతో వెలుగుతున్న ఫ్లై ఓవర్ ను పోస్టు చేశారు. ప్రభుత్వానికి క్రెడిట్ దక్కేలా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రచారం చేశారు.
తన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలలో పోస్టు పెట్టారు సురేష్ కుమార్ శర్మ.
నిజ నిర్ధారణ:
ఆయన పెట్టిన పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
ఆయన పోస్టు చేసిన ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆగష్టు 2020లో News Minute పోస్టు చేసిన ఒక ఆర్టికల్ లభించింది. సదరు వెబ్సైట్ లో అదే ఫోటోను పోస్టు చేశారు. ఈ ఫోటో హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ వద్ద ఉన్న బైరమల్గూడ జంక్షన్ కు సంబంధించింది.
'తెలంగాణ మినిస్టర్ కె.తారక రామా రావు ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. 780 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను ఓపెన్ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు' అని మీడియాలో కథనాలు వచ్చాయి.
కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా ఫ్లై ఓవర్ ఫోటోలను పోస్టు చేశారు. అందులో బీహార్ మినిస్టర్ పోస్టు చేసిన ఫోటో కూడా ఉంది.
రెండు ఫోటోలను బాగా గమనిస్తే ఒకటే అని అర్థం అవుతుంది. కింద రెండు ఫోటోలలో ఉన్న పోలికలను మీరు గమనించవచ్చు.
గూగుల్ ఎర్త్ లో కూడా ఫ్లై ఓవర్ కు దగ్గరలో ఓ బిల్డింగ్ ఉండడాన్ని గమనించవచ్చు. గూగుల్ ఎర్త్ లో కడుతున్న బిల్డింగ్ ఉంది.. కేటీఆర్ పోస్టు చేసిన ఫోటోలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ను చూడొచ్చు.
దీన్ని బట్టి బీహార్ మినిస్టర్ పోస్టు చేసిన ఫోటో హైదరాబాద్ కు చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆయన పెట్టిన పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.