గుంటూరు జిల్లా కొత్తపేటలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 9:53 AM GMT
గుంటూరు జిల్లా కొత్తపేటలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

గుంటూరు: కొత్తపేట శీలంవారివీధిలో ఓ భవనంలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. భవనంలోని మెడికల్‌ షాపులో ఈ పేలుడు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మెడికల్‌ షాపు యాజమాని రామారావు, మరో వ్యక్తి రామకృష్ణ. పేలుడు ధాటికి పక్క షాపుల షట్టర్లు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించిన పోలీసులు క్లూస్‌ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Next Story
Share it