తెలుగు సినీ కార్మికుల కోసం బిగ్ బి భారీ విరాళం
By రాణి Published on 17 April 2020 8:08 PM ISTతెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పెద్ద మనసుతో ముందుకొచ్చారు. టాలీవుడ్ లో రోజు కార్మికులుగా పనిచేసే వారికి సహాయం చేసేందుకు ఇప్పటికే చిరంజీవి అధ్యక్షతన సీసీసీ ఏర్పాటైంది. దీని ద్వారా కొన్ని వేల కార్మికులకు నిత్యావసరాలను కూడా అందించారు. తాజాగా.. బిగ్ బి 12000 తెలుగు సినీ కార్మికుల కుటుంబాలకు రూ.1500 విలువైన కూపన్లు అందించారు. అంటే అక్షరాలా కోటి 80 లక్షల విలువైన కూపన్లనమాట. విషయాన్ని చిరంజీవి ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. పెద్ద మనసుతో సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మీకు బిగ్ థ్యాక్స్ అని పేర్కొన్నారు. ఈ కూపన్లను బిగ్ బజార్ లో ఉపయోగించుకోవచ్చని చిరంజీవి తెలిపారు.
Also Read : అక్కడ కరోనా మరణాల కన్నా..లాక్ డౌన్ కాల్పుల మరణాలే అధికం
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా గురువారం సీసీసీకి రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ స్పందించని టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా విరాళమిచ్చేందుకు ముందుకొస్తున్నారు.
Also Read :వివాదాస్పదంగా హీరో నిఖిల్ పెళ్లి..!