కరోనా సృష్టించిన కఠినాత్మకమైన పరిస్థితుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాయి. కానీ..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ విషయాన్నిపెడచెవిన పెట్టారు. కొడుకు పెళ్లి ముహూర్తం నిశ్చయమై రెండు నెలలు కావస్తోంది. దీంతో ఎలాగైనా సరే అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయాలనుకున్నాకు. ఇలాంటి గట్టి ముహూర్తం మళ్లీ రాదనుకున్నారో ఏమో గానీ..అనుకున్నదే తడవుగా తన కుమారుడు, హీరో నిఖిల్ గౌడ వివాహాన్ని కన్నడ పొలిటికల్ లీడర్ కుమార్తె రేవతితో ఆదర బాదరాగా జరిపించేశారు. చెన్నై రామ్ నగర్ సమీపంలోని కేతగానహళ్లిలో ఉన్న ఫాం హౌస్ లో పెద్ద ఆర్భాటమేమీ లేకుండానే పెళ్లి తంతు జరిగింది. ఈ పెళ్లికి అతి తక్కువ సంఖ్యలోనే బంధువులు, ఇరుకుటుంబాల పెద్దలు హాజరయ్యారు.

Also Read : ఏప్రిల్, మే నెలల్లోనే పెళ్లిళ్లకు ఎందుకంత ప్రాధాన్యం ?

ఇలా పెళ్లి జరిగిందో లేదో..నిఖిల్ పెళ్లితంతుపై నివేదికివ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్ డౌన్ అమలులో ఉండగా హీరో నిఖిల్ వివాహం జరిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్. ఎంత గొప్పవారైనా సరే ప్రస్తుతానికి పెళ్లిళ్ల కార్యక్రమాలను వాయిదా వేయాలని ఆదేశించిన నేపథ్యంలో నిఖిల్ పెళ్లిపై చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవస్థను వెక్కిరించినట్లవుతుందని డిప్యూటీసీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన రామ్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఇప్పటికే పెళ్లి తంతుపై నివేదిక కోరామని, జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామని తెలిపారు. కాగా..పెళ్లిలో ఎవ్వరూ సామాజిక దూరం పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read :జీ 20 దేశాల్లో భారత్ వృద్ధిరేటే అధికం : ఆర్బీఐ గవర్నర్

రాణి యార్లగడ్డ

Next Story