దేశంలో మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాను మూడ్ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట ఇండియా టుడే పోల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నారో సర్వే తేల్చింది. ఇక బెస్ట్‌ సీఎంగా ఉత్రరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో ఉండగా, నాలుగో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నారు. ఇక రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మూడో స్థానంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అనేక వివాదస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమయ్యాడనే చెప్పాలి. ఇక తాజాగా మూడు రాజధానుల అంశంపై కూడా జాతీయ పత్రికల్లో సైతం కథనాలు వచ్చాయి. ఈ సర్వేలో జగన్‌ నాలుగో స్థానంలో నిలువడంపై వైసీపీ నేతల్లో ఆనందం ఉప్పొంగిపోతోంది. ఈ సర్వే రాజకీయ వర్గాల్లో హట్‌ టాపిగ్‌ గా మారింది. ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు రాకపోవడం గమనార్హం.

ఏ ముఖ్యమంత్రి ఎంత శాతం

ఈ సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ 13 శాతంలో మొదటి స్థానంలో ఉండగా, 11 శాతంతో రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత ఉన్నారు. 10 శాతంతో మూడో స్థానంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, 7శాతంతో నాలుగో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, 6శాతంతో ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌లు నిలిచారు. ఇక 4శాతంతో ఆరో స్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, 3శాతంతో ఏడవ స్థానంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు ఉన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.