ఉత్తమ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ అభినందనలు..
By న్యూస్‌మీటర్ తెలుగు
వరంగల్ రూరల్ జిల్లా: పరకాల శాసన సభ సభ్యుడు చల్లా ధర్మారెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమఎమ్మెల్యే అవార్డును అందుకున్నారు. చాణక్య ఫౌండేషన్ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. అయితే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో పరిశీలించిన చాణక్య ఫౌండేషన్ తెలంగాణ లోని పరకాలను ఉత్తమ నియోజకవర్గంగా ఎంపిక చేసింది. గత నెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి రామేశర్వర్‌తేలి, పద్మవిభూషన్ మురళీమోహనోహర్ జోషి చేతుల మీదుగా ధర్మారెడ్డి ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకీ పురస్కారం రావడానికి కారణమైన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఇందుకు కారణమని చల్లాధర్మారెడ్డ పేర్కొన్నాడు.