బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం ఎప్పుడు..?

By Newsmeter.Network  Published on  26 Nov 2019 6:46 AM GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం ఎప్పుడు..?

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. మొద‌టి చిత్రంతోనే న‌టుడుగా మంచి పేరు సంపాదించిన యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆత‌ర్వాత స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. రీసెంట్ గా చేసిన రాక్ష‌సుడు సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యాన్ని అందించింది.

ఈ స‌క్స‌స్ ను కంటిన్యూ చేసేలా వైవిధ్య‌మైన సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు.

రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి ప్రారంభం కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ కథను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నాడు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌త్యేకంగా 8ప్యాక్స్‌తో మేకోవ‌ర్ అయ్యారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల సినిమాటోగ్ర‌ఫీ అందించిన డూడ్లే ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప‌ని చేయ‌బోతున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 'అల్లుడుశీను' , 'జ‌య‌జానకి నాయ‌క‌' చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Next Story