ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
By సుభాష్ Published on 17 Oct 2020 2:45 AM GMTనేటి నుంచి 25వ తేదీ వరకు బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వబోతోంది. మొదటి రోజైన ఈ రో దుర్గమ్మ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్థం భక్తులకు అనుమతించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.
కరోనా దృష్ట్యా రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. స్లాట్ లేని భక్తులకు అనుమతి నిరాకరించనున్నాఉ. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలకు అనుమతించిన దేవస్థానం.. పరోక్షంగా జరిగే పూజలను వీడియోల ద్వారా వీక్షించే అవకాశం కల్పించింది ఆలయ కమిటీ. అయితే ఈ ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.