రూ. 2వేల కోట్ల విలువ చేసే బీరు వృధా అవుతోంద‌ట‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 May 2020 1:54 PM GMT
రూ. 2వేల కోట్ల విలువ చేసే బీరు వృధా అవుతోంద‌ట‌.!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి కోసం దాదాపుగా అన్ని దేశాల‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బ్రిటన్‌లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. అయితే ఆ దేశంలోని పబ్‌లన్నింటిని మూసివేయడంతో.. దాదాపు రూ. 7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోందని బ్రిటన్‌ బీర్‌ అండ్‌ పబ్‌ అసోసియేషన్‌ తెలిపింది.

లాక్‌డౌన్ కార‌ణంగా.. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. దీని కారణంగా దేశంలోని పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయిందని, అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాదని స‌ద‌రు అసోషియేష‌న్ తెలిపింది. రూ. 7 కోట్ల పింట్ల బీరు విలువ.. బ్రిటన్‌లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచ‌నా.

ఈ విష‌య‌మై అసోసియేషన్‌ చీఫ్‌ ఎమ్మా మార్క్‌క్లార్కిన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కార‌ణంగా మిగిలిపోయిన బీరులో కొంత భాగాన్ని సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల కోసం, జంతువుల దాణ కోసం ఉపయోగించవచ్చని ‌తెలిపారు. అయితే.. వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం ఆనందంగా ఉన్న‌ప్ప‌టికి.. పబ్‌లకు బారీ నష్టం వాటిల్లుతోందని.. దీంతో బీరు తయారీ కేంద్రాలను, పబ్‌లను కొంత మేరకైనా ప్రభుత్వం ఆదుకోవాలని మార్క్‌క్లార్కిన్ విజ్ఞప్తి చేశారు.

Next Story