తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ కిట్స్ ను ఇస్తోందా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2020 10:17 AM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ కిట్స్ ను ఇస్తోందా..?

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా నిత్యావసర కిట్స్ ను అందిస్తూ వస్తుంటాయి. ప్రతి ఏడాది ఇలాంటివి ఇస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో రంజాన్ తోఫాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పింక్ కలర్ లో ఉన్న ఓ రైస్ కిట్ ను రంజాన్ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందంటూ వార్తలువచ్చాయి. ఫ్రీ రంజాన్ రైస్ కిట్ అన్నది తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పలువురు వీటిని షేర్ చేస్తూ ఉన్నారు.

సుదర్శన్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేష్ చౌహాన్ పింక్ కలర్ లో ఉన్న కిట్ బ్యాగ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 'తెలంగాణ ప్రభుత్వం ముస్లింల కోసం.. స్పెషల్ కిట్ ను పంచుతోంది.. అది కూడా ఫ్రీగా.. హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి లకు కనీసం బయటకు కూడా పంపని తెలంగాణ ప్రభుత్వం.. ముస్లింలకు మాత్రం రంజాన్ తోఫా ఇస్తోంది' అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.నిజమెంత:

అతడు షేర్ చేసిన ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అది 2018లోని ఫోటో. నాలుగు లక్షల ముస్లిం కుటుంబాలకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ తోఫాను ఇచ్చింది. ఈ విషయం పలు పత్రికల్లో వచ్చింది. పలు వెబ్ సైట్లలో కూడా ఈ ఫోటోలు, అందుకు సంబంధించిన వార్తలను చూడచ్చు.

న్యూస్ మీటర్ ప్రముఖ టిఆర్ఎస్ నాయకుడిని సంప్రదించగా.. కోవిద్-19 ప్రబలుతున్న కారణంగా తాము ఎటువంటి రంజాన్ తోఫాలను ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఈ సంవత్సరం ఎటువంటి ఉచిత తోఫాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి రంజాన్ తోఫాలను పంచడం లేదు. తెలంగాణలో రంజాన్ తోఫాలు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారం 'మొత్తం అబద్ధం'. కేవలం పాత ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నది లేనట్లు కొందరు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

Is TRS offering free ramzan kits amid lockdown

Claim Review:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ కిట్స్ ను ఇస్తోందా..?
Claim Fact Check:false
Next Story