అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడిందని..
By Newsmeter.Network Published on 1 March 2020 4:32 PM IST
కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. అలాంటిది.. కూతురు చేసిన చిన్న పనినే తప్పుగా భావించిన ఆ తండ్రులు ఆమెను చిదకబాదారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డులోకి లాక్కొచి గుండుకొట్టించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అలిరాజ్‌పూర్ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్ బాలిక తెలిసిన అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. బాలిక ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. దీంతో వారి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. కన్న కూతురనే కనికరం లేకుండా బాలికను విపరీతంగా కొట్టారు.
దెబ్బలకు తాళలేక బాలిక.. ఇంకెప్పుడూ ఆ అబ్బాయితో మాట్లాడనని, తనను క్షమించాలని వేడుకుంది.
అయినా ఆమెపై కనికరం చూపలేదు. అందరూ చూస్తుండగానే వీధిలోకి లాక్కొచ్చి గుండు కొట్టించారు. ఈ ఘటన వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో వైరల్‌గా మారింది. వీడియో ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.