పంత్ ఫిట్‌నెస్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 27 March 2020 10:05 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి కారణంగా క్రీడా రంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. చాలా క్రీడలు రద్దు అయ్యాయి. కరోనా ముప్పుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడడంతో టిమ్ ఇండియా క్రికెటర్ తమ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడంతో బయటకు కూడా రావడం లేదు.
కాగా.. భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ సమయాన్ని తన ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడు. అందులో భాగంగా పంత్ పుష్ అప్‌లు, ట్రెడ్ మిల్‌పై పరుగులు తీయడం చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.
ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్ లో బాలీవుడ్ హిట్ సాంగ్ జబ్ సే హుయ్ హై షాదీ సాంగ్ ప్లే అవుతుండగా.. పంత్ ట్రెడ్ మిల్లుపై పరుగులు పెడుతున్నాడు. ఇటీవల భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ ఫన్నీ వీడియోను ఫోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్త ఎదుర్కొనే పరిస్థితులను సరదాగా చూపిస్తూ వీడియోను చేశాడు. ఈ వీడియోలో ధావన్ బట్టలు ఉతుకుతుండగా.. తన భార్య ఆయేషా ముఖర్జీ మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయేషా ఫోన్ మాట్లాడుతూ కర్ర పట్టుకొని ధావన్‌తో బలవంతంగా టాయిలెట్ కడిగించింది.