బ్రేకింగ్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో భారీ అగ్నిప్రమాదం

By సుభాష్  Published on  31 May 2020 2:16 AM GMT
బ్రేకింగ్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో భారీ అగ్నిప్రమాదం

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏ1 బ్లాక్‌ మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకున్న అంతస్తులో ఫర్నీచర్‌, ప్రొజెక్టర్‌, సుమారు 70 నుంచి 80 వరకూ చైర్లు, 20 వరకూ టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి..

మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద విషయం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

ఈ అగ్ని ప్రమాదంలో క్యాంపస్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే విద్యుత్‌ వైరింగ్‌ వ్యవస్థలో లోపం ఉండటంతో చిన్నపాటిగా మంటలు చెలరేగి భారీగా మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెబుతున్నారు. కాగా, గతంలో రెండుసార్లు కూడా ఇలా అగ్నిప్రమాదాలు జరిగినా.. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారి ప్రమాదం చోటు చేసుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it