కరోనా ఎఫెక్ట్‌: ఇక బార్లన్నీ మూసివేత

By సుభాష్  Published on  18 March 2020 3:27 PM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఇక బార్లన్నీ మూసివేత

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని సైతం అతలాకుతలం చేస్తూ గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా రాష్ట్రాలన్నీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. గురువారం నుంచి అక్కడ అన్ని లిక్కర్‌ బార్లను వేసివేయాలని ముఖ్యమంత్రి నారాయణ స్వామి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్నిపుణ్యక్షేత్రాలతో పాటు సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లను మూసివేసినట్లు చెప్పారు. కరైల్‌లోని తిరనల్లార్‌శనీశ్వరన్‌ ఆలయంలో పవిత్ర స్నానాలు చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మిగతా రాష్ట్రాల్లో కూడా బార్లను మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, భారత్‌లో కరోనాతో ఇప్పటి వరకు భారత్‌లో 147 కేసులు నమోదు కాగా, మంగళవారం ఒక రోజే 18 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో విదేశీయులనే కాకుండా ప్రవాస భారతీయులను కూడా ఇండియాకు రానివ్వకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఇక అత్యవసరం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ తేలితేనే అనుమతిస్తారని తెలుస్తోంది. అలాగే గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి 14 రోజుల పాటు క్యారంటైన్‌ను తప్పనిసరి చేసింది.

Next Story