డబ్బులు మళ్లించినందుకు మాజీ బ్యాంక్ మేనేజర్ కు శిక్ష!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 5:08 AM GMT
డబ్బులు మళ్లించినందుకు మాజీ బ్యాంక్ మేనేజర్ కు శిక్ష!

హైదరాబాద్: మాజీ బ్యాంక్ మేనేజర్ గా పని చేసిన దుడ్లా జ్యోతి ప్రసాద్ కు రెండు ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒక వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు అపహరించినందుకు గాను ఆమెపై 2015 లో చీటింగ్ కేసు నమోదు చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆమె దిల్ సుక్ నగర్ లోని ఒక బ్యాంక్ లో మేనేజర్ గా పని చేశారు. ఈ సమయంలో కొంత మంది కస్టమర్ల చిరునామా వివరాలు సరిగా లేనందున, వారికి వెళ్లే చెక్కులు బ్యాంకుకు తిరిగి రావడం గమనించింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు జ్యోతి ప్రసాద్.

ఇలా.. రెండు సంవత్సరాలలో రూ.21.50 లక్షలు సొంతం చేసుకున్నారు. కాని..బ్యాంకు లో ఆంతరంగిక సమీక్షలు జరిగినప్పుడు ఈ లావాదేవీల విషయం బయటకు వచ్చింది. 2015 లో వనస్థలిపురం పొలీసు స్టేషన్ లో ఆమె పై కేసు నమోదు అయ్యింది. ఆమెను రంగా రెడ్డి కోర్టులో ప్రవేశపెట్టగా రెండేళ్లు కఠిన కారాగార శిక్ష తో పాటు రూ. 10వేలు జరిమానా విధించారు.

Next Story
Share it