మచిలీపట్నం సెంట్రల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2020 2:28 PM GMT
మచిలీపట్నం సెంట్రల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం..

కృష్ణా జిల్లా మచిలీపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ బురిడీ కొట్టించాడు. బ్యాంక్‌లో తనకు తెలిసిన వారి చేత కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి బంగారం లోన్లను స్వాహా చేశాడు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేరుతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టి రూ. లక్షల్లో బ్యాంక్‌‌కు కుచ్చుటోపీ పెట్టాడు. అనంతరం మెళ్లిగా అక్కడ నుంచి జారుకున్నాడు. బ్యాంకు అధికారులు సైతం బంగారాన్ని తనిఖీ చెయ్యకుండానే రూ. లక్షల్లో నగదు ఇచ్చేశారు.

కొన్ని రోజుల తర్వాత బంగారం రంగు మారింది. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయించగా అవి నకిలీ నగలని తేలింది. దీంతో బ్యాంకు మేనేజర్ మోసపోయామని గ్రహించారు. వెంటనే ఖాతాదారులకు ఫోన్ చేసి కుదువ పెట్టిన వారి నగలను సరి చూసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంక్‌కు క్యూ కట్టారు. బ్యాంక్ మేనేజర్ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story