ఫాలోవర్స్ పెంచుకునేందుకు హాట్ ఫోటోలు.. ఇంటికి పోలీసులు రావడంతో..
By Newsmeter.Network Published on 5 March 2020 8:28 PM IST
సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం ప్రతి ఒక్కరు తెగ కష్టపడిపోతున్నారు. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫాలోవర్లు పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక కొందరు చేసే పని వారిని జైలు పాలు చేస్తుంది. తాజాగా ఫాలోవర్లను పెంచుకునేందుకు ఓ యువతి చేసిన పని.. చివరికి ఆమెను కటకటాల పాలు చేసింది.
గుజరాత్‌కు చెందిన ఓ యువతి(21) ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెంచుకోవాలని అనుకుంది. అనుకుందే తడవుగా.. హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేసింది. ఇక ఆ ఫోటోలను చూసిన వారు ఆమెకు ఫాలోవర్లుగా మారారు. దెబ్బకు లక్షల్లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ యువతి చేసిన పనికి కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటారా.. ఆ యువతి ఫోస్టు చేసిన ఫోటోలు ఆమెకు సంబంధించినవి కావు.. వేరే మహిళవి.
ఎవరో తన ఫొటోతో ఫేక్ ఖాతా తెరిచారని.. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌లో ఉన్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. తన ఫొటోను వాడుకోవడంతో పాటు.. ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫొటోలు పెడుతూ తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఫేక్ అకౌంట్ నడుపుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు. కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ యువతిని గుర్తించారు. ఆమె అడ్రస్‌ను వెతికి పట్టుకుని యువతి ఇంటికెళ్లారు. పోలీసులను చూసిన యువతి ప్లేటు ఫిరాయించేందుకు యత్నించింది. ఆ అకౌంట్‌తో తనకేమీ సంబంధం లేదని బుకాయించింది. ఐపీ అడ్రస్‌తో సహా పోలీసులు ఆధారాలు చూపడంతో కంగుతింది.