నేను చనిపోతున్నా.. నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి
By Newsmeter.Network Published on 26 Jan 2020 7:33 AM GMT
ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తను చనిపోయాక తన భార్యకు మరో పెళ్లి చేయాలని సూసైడ్ నోటు లో రాసి మరీ ఆత్మహత్య కు యత్నించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్ కుమార్(29)కు ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఓ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తూ.. జూబ్లీహిల్స్ రోడ్ నెం–10లోని గాయత్రి హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు శ్రవణ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా తన ఆత్మహత్యకు ఎవరూ కాదని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్న సూసైడ్ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య చాలా మంచిదని తనకు మళ్లీ పెళ్లి చేయాలని అందులో రాశాడు. తనకు ఓ వ్యక్తి డబ్బులు బాకీ ఉన్నాడని, ఆ డబ్బులతోనే తన అంత్యక్రియులు నిర్వహించాలని 11 రోజుల దశదినకర్మ చేసి డబ్బులు వృథా చేయవద్దని రాశాడు. ఈ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.