బంజారాహిల్స్ పీఎస్‌లో 15 మందికి కరోనా
By సుభాష్ Published on 13 Jun 2020 10:37 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక హైదరాబాద్‌లో మాత్రం తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇక ప్రజలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులను సైతం కరోనా వదలడం లేదు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏడుగురు పోలీసులకు కరోనా సోకింది. ఇప్పటి వరకు ఆ సంఖ్య 15కు చేరుకుంది. మూడు రోజులుగా జరుపుతున్న కరోనా పరీక్షల్లో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పోలీస్ స్టేషన్ అంత శానిటైజ్ చేస్తుస్తున్నారు.
కాగా, భారత్‌లో ప్రతి రోజు 9వేలకుపైగా కేసులు నమోదు కావడంతో దేశలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. ఇక లాక్‌డౌన్‌లో నిబంధనలు సడలించడంతో తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతి రోజు రెండువందలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.