మెట్రో కీలక నిర్ణయం!

By Newsmeter.Network  Published on  4 Dec 2019 9:01 PM IST
మెట్రో కీలక నిర్ణయం!

షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ బెంగళూరు మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెంగళూరు మెట్రో చేసిన ఆ ‍ప్రకటన గురించి దేశం అంతా చర్చించుకుంటోంది. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు.

సాధారణంగా రైళ్లలో చెకింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కన పడేసేవారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద గుర్తిస్తే ఇది వరకు వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు.

Next Story