అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం.. బండి సంజయ్‌ ఫైర్

By అంజి  Published on  17 March 2020 8:45 AM GMT
అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం.. బండి సంజయ్‌ ఫైర్

ఢిల్లీ: కేసీఆర్‌ వ్యవహారం చూస్తే తెలంగాణ తల దించుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్‌ఆర్సీ వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇక సీఎం కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఓవైసీ కూడా ఎన్‌పీఆర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందేనని, లేదంటే కేసీఆర్‌, ఒవైసీ పాకిస్తాన్‌ఉ శరణార్థులుగా వెళ్లాల్సిందేన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చేపట్టిన తీర్మానం చెత్త బుట్టకే పరిమితమన్నారు.

Also Read: రాజ్యసభకు మాజీ సీజేఐ రంజన్ గొగోయ్.. ప్రతిపక్షాల విమర్శలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్ర బీజేపీ నేతలు మౌన దీక్ష చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్య రాజ్యంగ విరుద్ధమని బీజేపీ నేతలు హెచ్చరించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఏం అవుతుందని బండి సంజయ్‌ ప్రశ్నించారు. వేరే దేశాలకు చెందిన ముస్లింలు మన దేశంలోకి వస్తే.. ముస్లిం పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసమే అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఈ తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు. దేశం గురించి ఆలోచించేంత సమయం కేసీఆర్‌కు ఎక్కడుందంటూ ఎద్దేవా చేశారు. సీఏఏ, ఎన్పీఆర్‌ అమలు జరిగి తీరుతాయని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Also Read: షిరిడీపై కరోనా ఎఫెక్ట్

తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు, రైతులు చనిపోయినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని విమర్శలు చేశారు.

Next Story