సిద్దిపేట సీపీని సస్పెండ్‌ చేయాలి: ఎంపీ బండి సంజయ్‌

By సుభాష్  Published on  27 Oct 2020 7:53 AM GMT
సిద్దిపేట సీపీని సస్పెండ్‌ చేయాలి: ఎంపీ బండి సంజయ్‌

దుబ్బాక ఉప ఎన్నిక సమరం కొనసాగుతోంది. నిన్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇంట్లో సోదాలపై పెద్ద దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు దిగారు. రాత్రి నేలపై పడుకొని నిరసన

వ్యక్తం చేశారు. సంజయ్‌ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలి గురించి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్‌ డేవిస్‌ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆయన ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని సంజయ్‌ స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుపు ఖాయమని భావించి అధికార పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇళ్లల్లో అక్రమంగా సోదాలు నిర్వహిస్తున్నారు..

సిద్దిపేటలో దబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లల్లో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆయన అరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్‌ లెవల్‌ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలన్నారు. సిద్దిపేట ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను రప్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతిభవన్‌ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా.. ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతి భవన్‌ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Next Story