101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 9:09 AM GMT
101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఆత్మ నిర్భర భారత్ ప్రకటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు సంబంధించిన 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేదం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది రక్షణ రంగంలో కీలకమైన అడుగు అని తెలిపారు. ఇక నుంచి ఆయుధాలతో పాటు రక్షణశాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఈరక్షణ రంగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

యుధ దళాల అవసరాలను గుర్తించి రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామన్నారు. సాయుధ దళాల అవసరాలను దేశీయంగా తీర్చటానికి వీలు ఉందని పేర్కొన్నారు. డీఎంఏ ద్వారా మరిన్ని రక్షణ పరికరాలను గుర్తించి నిషేధం విధిస్తామన్నారు. రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దుగా విభజించామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు విధిస్తామని చెప్పారు. నిషేధ ఉత్పత్తుల్లో ఫిరంగి తుపాకులు, రైఫిళ్లు, రవాణా విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం 101 ఉత్పత్తుల జాబితా సిద్ధం చేశామని, మరిన్ని రక్షణ పరికరాలను గుర్తించి వాటిపై కూడా నిషేదం విధిస్తామన్నారు. రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దులుగా విభజించామని ఆయన పేర్కొన్నారు.

ఈ నిర్ణయం భారత రక్షణ పరిశ్రమకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. కొత్త ఉత్పత్తుల్లో సొంత డిజైన్‌తో పాటు అభివృద్ధి సామర్థ్యాలను ఉపయోగించొచ్చు. లేదా సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు డీఆర్‌డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు అని రాజ్‌నాథ్‌ అన్నారు. 2015 నుంచి 2020 వరకు దాదాపు 230 పరికరాల కోసం దాదాపు 3.35లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని అన్నారు. అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రానున్న 6 నుంచి 7 సంవత్సరాల కాలంలో దాదాపు 7లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను దేశీయ పరిశ్రమతోనే కుదుర్చుకుంటామని తెలిపారు.

Next Story
Share it