కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ తెలియజేశారు. తాజాగా అమిత్‌ షాకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు తివారీ ట్వీట్‌ చేశారు. అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. త్వరలోనే షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. ఆగస్టు 2న జరిపిన కరోనా పరీక్షల్లో అమిత్‌షాకు పాజిటివ్‌ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ఇక అమిత్‌షాను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్, కైలాష్ చౌద‌రి, అర్జున్ రామ్ మేఘవాల్‌ కూడా క‌రోనా బారిన పడ్డారు

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.