బాలయ్య ఆధ్యాత్మిక వేత్తగా.. డిజాస్టర్ల దెబ్బకేనా ?

By అంజి  Published on  29 Jan 2020 8:02 AM GMT
బాలయ్య  ఆధ్యాత్మిక వేత్తగా..  డిజాస్టర్ల దెబ్బకేనా ?

అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు తమ సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేశాయని పోటీపడి మరి పోస్టర్స్ వదులుతుంటే.. పాపం బాలయ్య సినిమాలు మాత్రం ఈ మధ్య గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. అయితే ఇలా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమి కాదు, 'సింహా' సినిమాకి ముందు వరకూ బాలయ్య సినిమాల స్థాయి అందరికీ ఇంకా గుర్తు ఉంది. కానీ, 'సింహా' క్రియేట్ చేసిన రికార్డ్స్ సౌండ్ ఇంకా బాలయ్య ఫ్యాన్స్ గుండెల్లో రీసౌండ్ వస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడు బాలయ్యకు అలాంటి హిట్ కావాలి. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 15 నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది.

అయితే ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య బాబు కొన్ని సన్నివేశాల్లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడట. ఆధ్యాత్మికతతో మొదలైయ్యే బాలయ్య పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. అయితే బాలయ్య అసలు ఆధ్యాత్మిక వేత్తగా ఎందుకు మారాడు ? ఎలా మారాడు ? ఆయన గతం ఏమిటి అనే కోణంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీ ప్లాష్ బ్యాక్ రూపంలో వస్తోందని.. సినిమాలో యాక్షన్ చాల సహజంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు డిజాస్టర్ల దెబ్బకి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు.

ఈ సినిమాలో అంజలిని హీరోయిన్ ను తోసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంజలి బాలయ్య సరసన 'డిక్టేటర్' అనే సినిమాలో కలిసి నటించింది. నిజానికి ఈ మూవీలో మొదట హీరోయిన్ గా కేథరీన్ థెరీసా తీసుకోవాలనుకున్నారు, కానీ అమ్మడు బాలయ్య సరసన అనే సరికి రెమ్యునిరేషన్ ను ఓ రేంజ్ లో డిమాండ్ చేసింది. దాంతో అంజలికి కమిట్ అయింది చిత్రయూనిట్. ఇక శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య 'యుద్ధం శరణం'లో విలన్ గా నటించినా సక్సెస్ కాలేదు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Next Story
Share it