బ్రేకింగ్ : త‌లైవాకు గాయాలు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jan 2020 4:20 PM GMT
బ్రేకింగ్ : త‌లైవాకు గాయాలు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌

సూప‌ర్‌స్టార్‌ రజినీకాంత్ అభిమానుల‌కు నిజంగా ఇది చేదువార్తే. ర‌జ‌నీ ప్రస్తుతం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న ర‌జ‌నీ ప్రమాదానికి గురయ్యారు. ఈ షూటింగ్ కర్ణాటకలోని బందిపుర టైగర్ రిజర్వ్‌లో జరుగుతుంది.

ఈ షూటింగ్ నేటి నుండి మూడు రోజుల పాటు అక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఆయన షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో పాటు రజినీ ఈ షూటింగ్ చేస్తున్నాడు. షూట్ చేస్తున్నపుడు అనుకోకుండా రజినీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ర‌జ‌నీ భుజానికి గాయాలయ్యాయి. అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాదని.. స్వల్ప గాయాలే అని వైద్యులు తేల్చారు. గాయం కార‌ణంగా ర‌జ‌నీ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై బ‌య‌లుదేరారు. రజినీ ప్రమాదం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Next Story