బాల‌య్య మూవీలో కీర్తి సురేష్‌..?

By Newsmeter.Network  Published on  7 Dec 2019 10:10 AM GMT
బాల‌య్య మూవీలో కీర్తి సురేష్‌..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం రూల‌ర్ అనే సినిమా చేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేంద‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. మిర్యాల ర‌వీందర్ రెడ్డి నిర్మించే ఈ భారీ చిత్రం నిన్న సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

అయితే... ఈ మూవీలో క‌థానాయిక ఎవ‌రు అనేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. తాజా వార్త ఏంటంటే... ఇందులో బాలయ్య స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించ‌నుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది నిజ‌మా..? కాదా..? అని ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే... బోయ‌పాటి ఇటీవ‌ల చెన్నై వెళ్లి కీర్తి సురేష్ ని క‌లిసాడ‌ట‌. క‌థ చెప్పాడ‌ట‌. కీర్తికి ఈ సినిమా క‌థ చాలా బాగా న‌చ్చింద‌ట కానీ.. ఇందులో నటిస్తుందా..? లేదా..? అనేది ఇంకా చెప్ప‌లేద‌ట‌.

ఇందులో బాలీవు డ్ హీరో సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా చాలా స్పీడుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా బోయ‌పాటి ప‌క్కా ప్లాన్ రెడీ చేసార‌ని తెలిసింది. సమ్మ‌ర్ లో ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి... బాల‌య్య స‌ర‌స‌న న‌టించేందుకు కీర్తి సురేష్ ఎస్ చెబుతుందో..? నో చెబుతుందో..? చూడాలి.

Next Story