ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు - బాల‌కృష్ణ‌

By Newsmeter.Network  Published on  6 Dec 2019 1:27 PM GMT
ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు - బాల‌కృష్ణ‌

ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు - బాల‌కృష్ణ‌

దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాన్నగారు అన్న నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగిందని బాల‌కృష్ణ అన్నారు.

అలాగే ’లెజెండ్‌' సినిమాలో మేము కూడా స్త్రీ లేకుంటే సృష్టి లేదు అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది, మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది.

అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని బాల‌కృష్ణ‌ అన్నారు.

Next Story