సినిమా చూసి వస్తుండగా.. కత్తి మహేష్‌ పై దాడి

By Newsmeter.Network  Published on  14 Feb 2020 11:51 AM GMT
సినిమా చూసి వస్తుండగా.. కత్తి మహేష్‌ పై దాడి

ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నా సినీ విమర్శకుడు కత్తి మహేష్ తీరు మారటం లేదు. ఇప్పటికే ఓ సారి.. హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. శిక్ష పూరైన అనంతం కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాడు. కొద్ది రోజులు సైలెంట్‌గానే ఉన్నా.. మొన్న శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ రోజు విజయదేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్‌ లవర్‌ సినిమా చూసేందుకు ఐమాక్స్‌ కు వచ్చిన మహేష్‌ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసారు. సినిమా ముగించుకుని వెళ్తున్న ఆయన కారుపై దాడి చేశారు. దాంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్‌కు చేరుకుని కత్తి మహేష్‌ను అక్కడ్నుంచి సేఫ్‌ గా పంపించారు. దాడి చేసిన వారిని బజ్ రంగ్ దళ్ కార్యకర్తలుగా గుర్తించిన సైఫాబాద్ పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ తరలించారు. శ్రీ రాముడు మాంసం తింటాడని.. ఆయనకు జింక మాంసం అంటే ఇష్టమంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్.

Next Story