చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ వెనుక మార్కెట్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐ 10 కారు వేగంగా దూసుకొచ్చింది. అక్కడే కూరగాయల విక్రయాలు జరుపుతున్న తోపుడు బండ్లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.