పాపం పసి బిడ్డ..? కన్నతండ్రే కడతేర్చాడు!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2019 11:04 AM GMTపాపం.. ఆ పసికందు హృదయం ఎంత ప్రాథేయ పడిందో ప్రాణంకోసం. తండ్రి ఎత్తుకున్నప్పుడు తనను ఆవే చేతులు చిదేమిస్తాయని తెలియక. ఆ చేతి స్పర్శ తగలగానే బోసినవ్వులతో ఎంత పులకించి పోయిందో.. అదే చివరి స్పర్శ అవుతుందని తెలియక.
నెల రోజుల శిశువును నీటి తొట్టిలో పడేసి హతమార్చిన కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంట గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. రెండో సంతానం కూడా ఆడ బిడ్డ పుట్టిందని నెలరోజుల శిశువును నీటి తొట్టెలో పడేసి చంపాడు తండ్రి సూర్యతేజ. మొదటి సంతానంలో ఆడపిల్ల పుట్టింది. రెండో సంతానంలో నైనా వంశోద్దారకుడు వస్తాడని ఆశించిన సూర్య తేజకు.. భార్య మరోమారు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో.. పితృ స్వామ్య వ్యవస్థ నర నరాల్లో పేరుకుపోయిన సూర్యతేజ.. ఆడపిల్ల పుట్టిందని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. పసికందు అనే కనికరమైనా చూపకుండా నీటితొట్టిలో పడేశాడు. చేయి పట్టి నడిపించాల్సిన నాన్నే నీటి తొట్టిలో వదిలేశాడు. పాపం ఆ పసికందు నీటిలో శ్వాస ఆడక ఎంత తల్లడిల్లిందో ప్రాణం విడిచే ముందు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సూర్య తేజను అదుపులోకి తీసుకున్నారు. కన్నబిడ్డనే కడతేర్చిన కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.