అయోధ్య ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం

By సుభాష్  Published on  7 Jun 2020 9:41 AM GMT
అయోధ్య ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం

జూన్‌ 10వ తేదీ నుంచి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రుద్రాభిషేకం చేసిన పనులను ప్రారంభించనున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రకటించింది. లంక విజయానికి ముందు శ్రీరాముడు శివరాధాన చేశారని, అందుకే ఆలయ నిర్మించే ముందు శివారాధన చేస్తామని తెలిపారు.

ఇది చదవండి: ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

రామ్‌ జన్మభూమి కాంప్లెక్స్‌ లోని శశాంక్‌ శేఖర ఆలయంలో ఈ రుద్రాభిషేకం తర్వాత ఆలయ నిర్మాణం పనును మొదలు కానున్నాయని తెలిపింది. అయితే ఈ నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ 10వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 10న మహంత్‌ కమల్‌ నయన్‌ దాస్‌, తదితర సాధువులతో ఈ రుద్రాభిషేకం ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమం రెండు గంటల పాటు జరుగుతుందని, ఆ తర్వాతే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ట్రస్ట్‌ తెలిపింది.

Next Story
Share it