ఏటీఎంకు వెళ్ల‌కుండా ఇంటికే న‌గ‌దు.. కావాలంటే ఇలా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2020 7:06 PM IST
ఏటీఎంకు వెళ్ల‌కుండా ఇంటికే న‌గ‌దు.. కావాలంటే ఇలా..

క‌రోనా వైర‌స్ (కొవిడ్‌-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మాత్ర‌మే బ‌య‌టికి వ‌స్తున్నారు. పాలు, కూరగాయలు, మెడిసిన్ లాంటివి కొనడానికి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా మీరు ఏటీఎంల‌కు వెళ్ల‌లేక‌నోతున్నారా..? మ‌రీ డ‌బ్బ‌లు ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారా..? మీ కోస‌మే బ్యాంకులు ఇంటికి న‌గ‌దును పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు కస్టమర్లకు డబ్బుల్ని ఇంటికే పంపిస్తున్నాయి.

మీకు అత్య‌వ‌స‌రంగా న‌గ‌దు కావాల్సి వ‌స్తే మీ బ్యాంకును సంప్ర‌దించొచ్చు. మీ ఇంటికే న‌గ‌దును పంపిస్తాయి బ్యాంకులు. అంతేకాకు ఇంటి వ‌ద్ద‌నే ఉండి మీ మ‌నీని డిపాజిట్ చేయొచ్చు. అయితే ఈ సేవ‌లు వినియోగించుకోవాలంటే.. బ్యాంకులు కొంత రుసుమును వ‌సూలు చేస్తున్నాయి. ఈ రుసుములు ఒక్కో బ్యాంకులో ఒక్కో ర‌కంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ అయితే డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్‌ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డబ్బులు డిపాజిట్ చేయాలన్నీ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వృద్ధులు, వికలాంగుల కోసం ఎస్‌బీఐ డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్ గతంలో ప్రారంభించింది బ్యాంకు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఏ కస్టమర్ అయినా ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు రూ.100 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఇలాంటి సేవల్నే అందిస్తోంది. అయితే రూ.5000 నుంచి రూ.25000 మధ్య మాత్రమే క్యాష్ అందిస్తుంది. ఇందుకు రూ.100 నుంచి రూ.200 మధ్య ఛార్జీలు చెల్లించాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ సేవల్ని అందిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాష్ ఆర్డర్ చేయొచ్చు. రూ.2000 నుంచి రూ.2,00,000 మధ్య డబ్బులు ఆర్డర్ చేయొచ్చు. కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్‌ని అందిస్తున్నాయి.

Next Story