ఉచితంగా జియో డేటా.. పొందాలంటే ఇలా చేయండి

జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి 15వేల‌కు పైగా మంది మృత్యువాత ప‌డ‌గా.. 3.5ల‌క్ష‌ల మంది దీని బాధితులు ఆస్ప‌తుల్లో చికిత్స‌పొందుతున్నారు. భార‌త్‌లో కూడా 500పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఉద్యోగులంద‌రిని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేయాల్సిందా దాదాపు అన్ని కంపెనీలు ఆదేశించాయి. దీంతో డేటా వినియోగం బాగా పెరిగింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో జియో త‌న వినియోగ‌దారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేపట్టిన #CoronaHaaregaIndiaJeetega కార్యక్రమం ద్వారా ఎటువంటి సర్వీస్ చార్జీలు లేకుండా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తామని జియో ప్రకటించింది. జియోఫైబర్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ 10 ఎంబీపీఎస్ వేగంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపింది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న జియో ఫైబర్ వినియోగదారులు అన్ని ప్లాన్‌లకు డబుల్ డేటాను పొందుతారు. ఇలాంటి కీలకమైన సమయంలో ఇటువంటి కీలక సేవలు ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉండాలని కంపెనీ నిర్ణయించింది. కరోనావైరస్ తో పోరాడటానికి భారతదేశానికి సహాయపడటానికి, ఎటువంటి సేవలకు ఆటంకం కలగకుండా చూసుకోవడానికి రిలయన్స్ ఈ సేవలను సమకూర్చింది.

4జీ డేటా కోసం యాడ్-ఆన్ వోచర్‌లపై డబుల్ డేటాను అందిస్తున్నట్లు జియో ఇటీవలే ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ వోచర్‌లకు అదనపు ఖర్చు లేకుండా నాన్ జియో వాయిస్ కాలింగ్ నిమిషాలను కూడా జియో అందించనుంది.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *